: సునీతా కృష్ణన్ పోరాటం ఫలించింది...రేపిస్టులను పట్టుకున్నారు
'ప్రజ్వల' స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు సునీతా కృష్ణన్ పోరాటం ఫలించింది. అత్యాచారం చేయడమే కాకుండా, ఆ వీడియోను వాట్స్ యాప్, ఇతర సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసి దుర్మార్గాన్ని చాటుకున్న కామాంధులపై యుద్ధం ప్రకటించి, ప్రచారం చేసిన సునీతా కృష్ణన్ కారుపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. దీనిని సుమోటోగా సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్ఎల్ దత్తు విచారించి, చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్రాన్ని ఆదేశించారు. దీంతో వీడియోలో ఉన్న సబ్రతా సాహును సీబీఐ అదుపులోకి తీసుకుంది. ప్రాపర్టీ డీలరైన సబ్రతా సాహు చేసిన అరాచకాల్లో అత్యాచారాలు ఉన్నాయి. సాహు అత్యాచారానికి పాల్పడుతుండగా, మరొక వ్యక్తి దానిని చిత్రీకరించాడు. అతనితోపాటు ఇతర కేసుల్లో నిందితులు మరో ఆరుగురిని సీబీఐ గుర్తించిందని, వారిని అరెస్టు చేయాల్సి ఉందని సునీతా కృష్ణన్ తెలిపారు.