: తెలంగాణ రాకముందు అసత్య ప్రచారాలు చేశారు... హైదరాబాద్ లో ఎవరైనా ఉండొచ్చు: కేటీఆర్
హైదరాబాదులో స్థానికులు కాకుండా ఏళ్ల తరబడి ఉంటున్న వారి విషయంలో మంత్రి కేటీఆర్ మరోసారి స్పష్టత ఇచ్చారు. ఇక్కడ ఎవరైనా ఉండొచ్చని స్పష్టం చేశారు. తెలంగాణ వస్తే ఇక్కడేదో జరిగిపోతుందని తెలంగాణ రాకముందు పలువురు అసత్య ప్రచారం చేశారని మండిపడ్డారు. కానీ తెలంగాణ వచ్చిన 9 నెలల కాలంలో ఎలాంటి ఘటనలు జరగలేదని కేటీఆర్ చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పారదర్శకంగా ముందుకు వెళుతుందని, అందరినీ సమానంగా చూస్తుందని, ఎవరికీ ఇబ్బంది లేదని పేర్కొన్నారు.