: కష్టాల్లో భారత్... 27 ఓవర్లలో 125/4
329 పరుగుల లక్ష్యాన్ని అందుకునే దిశలో భారత్ కీలకమైన నాలుగు వికెట్లు కోల్పోయింది. 75 పరుగుల వరకూ వికెట్ నష్టపోకుండా పటిష్టంగా ఉన్న జట్టు 33 పరుగుల వ్యవధిలో 4 వికెట్లు కోల్పోయింది. సిడ్నీ మైదానంలో మ్యాచ్ ని ప్రత్యేక్షంగా తిలకిస్తున్న అభిమానులు కన్నీరు కార్చడం కనిపించింది. ప్రస్తుతం రహనే 22, ధోనీ 7 పరుగుల వద్ద కొనసాగుతున్నారు. భారత స్కోర్ 27 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 125 పరుగులు. వరల్డ్ కప్ ఫైనల్స్ లో ప్రవేశించాలంటే, మరో 23 ఓవర్లలో 204 పరుగులు చేయాల్సి ఉంది.