: డాక్టర్ ను ఫ్యాక్షనిస్ట్ అంటారా?... వైకాపాపై అనిత నిప్పులు


అసెంబ్లీలో జరుగుతున్న కార్యకలాపాలను 5 కోట్ల మంది ప్రజలు చూస్తున్నారన్న జంకు కూడా లేకుండా వైకాపా సభ్యులు ప్రవర్తిస్తున్నారని తెలుగుదేశం సభ్యురాలు అనిత నిప్పులు చెరిగారు. డాక్టర్ విద్యను అభ్యసించిన స్పీకర్ కోడెలను విపక్ష సభ్యులు ఫ్యాక్షనిస్ట్ అని సంబోధించారని, ఇది ఎంతమాత్రం భావ్యమని ఆమె ప్రశ్నించారు. అతి తెలివితో వైకాపా సభ్యులు సభాపతిని అవమానించారని నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రిని విమర్శించే అర్హత వైకాపాకు లేదని ఆమె అన్నారు. వైకాపా సభ్యులపై చర్యలు తీసుకోవాలని అనిత కోరారు.

  • Loading...

More Telugu News