: సొంత నావిగేషన్ వ్యవస్థ దిశగా ఇండియా
భారత్ మరో మైలురాయిని అధిగమించేందుకు రంగం సిద్ధం చేసింది. నెల్లూరు జిల్లాలోని షార్ అంతరిక్ష కేంద్రం నుంచి పీఎస్‌ఎల్వీసీ-27 ప్రయోగానికి కౌంట్ డౌన్ మొదలైంది. మార్చి 28న సాయంత్రం 5:19 గంటలకు సీ-27 ద్వారా ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1డి ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రవేశపెట్టనున్నారు. ఈ ఉపగ్రహం బరువు 1425 కిలోలు. ఈ ప్రయోగం విజయవంతం అయితే సొంత నావిగేషన్ వ్యవస్థ అందుబాటులోకి రానుంది. దీని ద్వారా వాహానాల రాకపోకలు, రైళ్ళ గమనం వంటి సేవలు మరింత సమర్థవంతంగా అందుతాయని శాస్త్రవేత్తలు తెలిపారు.