: పరీక్ష హాలులో పురుగుల మందు తాగిన విద్యార్థి
తనకు తెలియని ప్రశ్నలు వచ్చాయనో లేక మరేదైనా కారణం ఉందోగానీ, పరీక్ష హాలులో ఒక విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. ఈ ఘటన కృష్ణా జిల్లా తిరువూరులో గురువారం ఉదయం జరిగింది. నాగాయలంకకు చెందిన అనంతసాయి తిరువూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో వోకేషనల్ కోర్సు మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈ ఉదయం పరీక్షకు హాజరైన అనంతసాయి, తనతో ముందే తెచ్చుకున్న పురుగుల మందును తాగాడు. దీంతో, అప్రమత్తమైన అధికారులు అతడిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఉదంతం వెనుక గల కారణాలు తెలియాల్సి ఉంది.