: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమితో టీఆర్ఎస్ కు బ్రేక్: కాంగ్రెస్ ఎమ్మెల్యే చిన్నారెడ్డి


తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల స్థానంలో అధికార పార్టీ టీఆర్ఎస్ అభ్యర్థి ఓటమిపై కాంగ్రెస్ ఎద్దేవా చేసింది. ఈ ఓటమితో టీఆర్ఎస్ ఒంటెద్దు పోకడలకు బ్రేక్ పడిందని ఆ పార్టీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి అన్నారు. పార్టీలకతీతంగా ప్రజలు దేవీప్రసాద్ (టీఆర్ఎస్ అభ్యర్థి)ను ఓడించి రామచంద్రరావు (బీజేపీ అభ్యర్థి)ను గెలిపించారన్నారు. ఇక రాష్ట్ర స్థాయి ఉద్యోగుల విభజన ఆలస్యం చేయొద్దని చెప్పారు. ఏపీకి వెళ్లాల్సిన ఉద్యోగులు రాష్ట్రంలో లక్షా 45వేల మంది ఉన్నారన్న చిన్నారెడ్డి, సీఎం చంద్రబాబుతో సీఎం కేసీఆర్ చర్చించి వారిని అక్కడికి పంపాలని సూచించారు. అదేవిధంగా ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను తెలంగాణకు రప్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.

  • Loading...

More Telugu News