: ‘తొలి ప్రాధాన్యం’లో తేలని ఫలితం... మరికాసేపట్లో ద్వితీయ ప్రాధాన్యం లెక్కింపు


వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల పరిధిలోని పట్టభద్రుల శాసనమండలి స్థానానికి జరుగుతున్న ఓట్ల లెక్కింపు రాత్రి పొద్దు పోయే దాకా కొనసాగనుంది. టీఆర్ఎస్, బీజేపీల మధ్య హోరాహోరీగా సాగుతున్న పోరులో టీఆర్ఎస్ అభ్యర్థి రాజేశ్వరరెడ్డి స్వల్ప మెజారిటీ సాధించినా, విజయం సాధించేందుకు అవసరమైన మేర ఓట్లను సాధించలేకపోయారు. 16 రౌండ్ల పాటు జరిగిన తొలి ప్రాధాన్యం ఓట్ల లెక్కింపులో పల్లా రాజేశ్వరరెడ్డి 13 వేలకు పైగా మెజారిటీ సాధించారు. అయితే విజయం సాధించేందుకు అవసరమైన 50 శాతం ఓట్లు ఆయనకు పోల్ కాలేదు. దీంతో ద్వితీయ ప్రాధాన్యతా ఓట్ల లెక్కింపు అనివార్యమైంది. మరో గంటలో ద్వితీయ ప్రాధాన్యతా ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఈ ప్రక్రియ నేటి రాత్రి 8 గంటలకు కాని పూర్తయ్యేలా లేదు.

  • Loading...

More Telugu News