: మరో కీలక వికెట్ కోల్పోయిన ఆసీస్... ఈసారి మోహిత్ వంతు


భారత్ తో జరుగుతున్న సెమీ ఫైనల్లో భారీ స్కోరు సాధిస్తుందనుకున్న ఆసీస్ తడబడుతోంది. 2 వికెట్ల నష్టానికి 231 పరుగులతో పటిష్ఠంగా ఉన్న ఆస్ట్రేలియా బ్యాటింగ్ లైనప్ ఒక్కసారిగా కుదుపునకు గురైంది. కేవలం 17 పరుగుల తేడాతో 3 వికెట్లను కోల్పోయింది. జట్టు స్కోరు 248 వద్ద ఐదో వికెట్ ను కోల్పోయింది. కెప్టెన్ క్లార్క్ కేవలం 10 పరుగులు మాత్రమే చేసి ఆసీస్ అభిమానులను నిరాశపరిచాడు. మోహిత్ శర్మ బౌలింగ్ లో రోహిత్ శర్మ క్యాచ్ పట్టడంతో క్లార్క్ పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం వాట్సన్ (13), ఫాల్కనర్ (1) క్రీజులో ఉన్నారు. ఆసీస్ స్కోరు 44 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 258 పరుగులు.

  • Loading...

More Telugu News