: బాబు సర్కారును కడిగేసిన కాగ్... శాసనసభ ముందుకు నివేదిక


ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ముందుకు కాగ్ నివేదిక వచ్చింది. ఈ నివేదికలో చంద్రబాబు సర్కారును కాగ్ తప్పుబట్టింది. ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు నిర్ణీత ప్రమాణాలకు లోబడి లేవని, వైద్యకళాశాలలు, బోధనా ఆసుపత్రులు ప్రమాణాలు పాటించట్లేదని వెల్లడించింది. ఐటీడీఏల్లో 51 శాతం నిధులు మాత్రమే వినియోగించారని, ఆర్థిక రంగంలో 44 శాతం నిధులను, సాధారణ రంగంలో 94 శాతం నిధులను అసలు ఖర్చే పెట్టలేదని తెలిపింది. నీటిపారుదల, రహదారుల విభాగాల్లో చేపట్టిన పనులు, ప్రాజెక్టుల్లో పురోగతి లేదని ఆక్షేపిస్తూ, ప్రైవేటు భాగస్వామ్య లీజు ఒప్పందాల్లో తప్పుల వల్ల రూ. 665 కోట్ల నష్టం వాటిల్లిందని పేర్కొంది. మోటారు వాహనాలపై పన్ను వసూలు లోపాల వల్ల ఏపీ సర్కారు రూ. 460 కోట్ల ఆదాయాన్ని కోల్పోయిందని తెలిపింది.

  • Loading...

More Telugu News