: జగన్ కేసులో ఈడీ జోరు... ఇందూ ప్రాజెక్టుకు చెందిన రూ.132 కోట్ల ఆస్తులు జప్తు
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ స్పీడు పెంచింది. ఇప్పటికే జగన్ సహా పలువురు వ్యక్తులు, సంస్థలకు చెందిన ఆస్తులను జప్తు చేసిన ఈడీ, తాజాగా ఇందూ ప్రాజెక్టు అధినేత శ్యాంప్రసాద్ రెడ్డికి చెందిన మరో రూ.132 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉండగా, ఆయన ప్రభుత్వం నుంచి రాయితీలు పొందిన ఇందూ ప్రాజెక్టు, అందుకు ప్రతిగా జగన్ కంపెనీల్లో భారీగా పెట్టుబడులు పెట్టిందని సీబీఐ ఆరోపిస్తోంది. ఈ మేరకు సీబీఐ దాఖలు చేసిన చార్జి షీటును ఆధారంగా చేసుకుని ఈడీ ఈ చర్య తీసుకుంది.