: ఏపీలో పదవ తరగతి పరీక్షలు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు నుంచి పదవ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9.30 గంటల నుంచి మొదలై 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. 2,979 కేంద్రాల్లో 6,53,692 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. పరీక్షల నిర్వహణ కోసం 156 ఫ్లైయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశారు. మరోవైపు విద్యార్థుల కోసం ఆర్టీసీ ఉచితంగా ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ముక్కాల రవీందర్ తెలిపారు. మాస్ కాపీయింగ్ ను కట్టడి చేయాలన్న ఆలోచనతో సమస్యాత్మక పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు వినియోగించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు 13 జిల్లాల్లోని ఒక్కో కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.