: భారీ స్కోరు దిశగా ఆసీస్... స్మిత్ హాఫ్ సెంచరీ


ఊహించినట్టుగానే సిడ్నీ పిచ్ బ్యాటింగ్ కు అనుకూలిస్తోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా, రెండో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో, భారీ స్కోరే లక్ష్యంగా బరిలోకి దిగిన ఆసీస్ బ్యాట్స్ మెన్... తమ బ్యాట్లను ఝుళిపిస్తున్నారు. 15 పరుగులకే డేంజరస్ వార్నర్ వికెట్ ను కోల్పోయినప్పటికీ... ఆసీస్ బ్యాట్స్ మెన్ తగ్గలేదు. ఫించ్ 46 పరుగులు చేయగా, స్మిత్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని 59 పరుగులతో ఆడుతున్నాడు. ప్రస్తుతం ఆసీస్ స్కోర్ 24 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 124 పరుగులు.

  • Loading...

More Telugu News