: గుడ్ లక్ టీమిండియా... వైఎస్ జగన్ అభినందనలు
వరల్డ్ కప్ సెమీస్ మ్యాచ్ లో భాగంగా సిడ్నీలో నేడు ఆసీస్ తో తలపడుతున్న టీమిండియాకు వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన ట్విట్టర్ ఖాతా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. విజయపథంలో దూసుకెళ్తున్న టీమిండియా మరో విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఉదయం 7:45 గంటలకు ఆయన ట్వీట్ చేయగా, ఇప్పటివరకూ 100కు పైగా రీ ట్వీట్లు వచ్చాయి. ఆయన Wishing you good luck in the Semis today #IND #IndvsAus #CWC15! Let's go all the way!! అని ట్వీట్ చేశారు.