: 10 ఓవర్లలో ఆసీస్ స్కోరు 56/1... బౌలింగ్ కు దిగిన కోహ్లీ!
వరల్డ్ కప్ సెమీ ఫైనల్లో భాగంగా ఆసీస్ తొలి పది ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 56 పరుగులు చేసింది. 12 పరుగులు చేసి ఉమేశ్ యాదవ్ బౌలింగ్ లో డేవిడ్ వార్నర్ ఔట్ కాగా క్రీజులోకి వచ్చిన స్మిత్ 30 పరుగులు చేశాడు. ఓపెనర్ గా బరిలోకి దిగిన ఆరోన్ పించ్ ఆచితూచి ఆడుతూ పది ఓవర్లు ముగిసేసరికి 11 పరుగులు చేశాడు. బ్యాటింగ్ కు అనుకూలిస్తున్న సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో ఆసీస్ బ్యాట్స్ మెన్ ధాటిగా బ్యాటింగ్ చేస్తున్నారు. అయితే ఆదిలోనే తొలి వికెట్ పడటంతో వారి బ్యాటింగ్ కాస్త నెమ్మదించింది. పది ఓవర్ల పాటు షమీ, ఉమేశ్ లతో బౌలింగ్ చేయించిన టీమిండియా సారధి ఆ తర్వాత మోహిత్ శర్మను రంగంలోకి దించాడు. 12వ ఓవర్ ను వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీతో వేయించిన ధోనీ, ఆసీస్ తో పాటు అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశాడు.