: ఛేజింగ్ లో ధోనీ కింగే!... టీమిండియాదే గెలుపంటున్న విశ్లేషణలు


వరల్డ్ కప్ సెమీ ఫైనల్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా క్రికెట్ ఫీవర్ ఒక్కసారిగా పెరిగిపోయింది. దేశంలోని ప్రధాన నగరాలతో పాటు చిన్న పట్టణాలు, పల్లెలన్న తేడా లేకుండా అన్ని చోట్లా ధోనీ సేన ప్రదర్శనపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ క్లార్క్ తొలుత బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకోవడంతో, టీమిండియాదే విజయమన్న విశ్లేషణలు మొదలయ్యాయి. ఎందుకంటే, ఛేజింగ్ లో టీమిండియా సారథి మహేంద్ర సింగ్ ధోనీకి మెరుగైన రికార్డులున్నాయి. గడచిన వరల్డ్ కప్ లోనూ శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో రెండోసారి బ్యాటింగ్ చేసిన టీమిండియాకు కెప్టెన్ ధోనీ కళ్లు చెదిరే ఫినిషింగ్ టచ్ తో విజయాన్ని అందించాడు. ఈ నేపథ్యంలో నేటి ఛేజింగ్ లోనూ ధోనీ మ్యాజిక్ చేస్తాడన్న విశ్లేషణలు సాగుతున్నాయి.

  • Loading...

More Telugu News