: వరల్డ్ బెస్ట్ స్పిన్నర్లతో టీమిండియా... ఆసీస్ కు పార్ట్ టైమ్ స్పిన్నర్లే దిక్కు!
వరల్డ్ కప్ మెగా టోర్నీలో భాగంగా మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్న రెండో సెమీ ఫైనల్ కోసం ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మ్యాచ్ జరగనున్న సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ స్పిన్ కు స్వర్గధామం. మరో గంటలో ప్రారంభం కానున్న మ్యాచ్ లో టీమిండియా రవిచంద్రన్ అశ్విన్ లాంటి ప్రపంచ అత్యుత్తమ స్పిన్నర్ తో పాటు మిస్టరీ స్పిన్నర్ రవీంద్ర జడేజాతో బరిలోకి దిగుతోంది. ఇక టీమిండియా కీలక బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ, సురేశ్ రైనాలు కూడా బంతితో అద్భుతాలు చేసే సత్తా ఉన్నవారే. ఈ క్రమంలో వరల్డ్ బెస్ట్ స్పిన్నర్లతోనే టీమిండియా సెమీస్ బరిలోకి దిగుతోంది. మరోవైపు ఫాస్ట్ బౌలింగ్ తో మెరుగైన ఫలితాలు సాధిస్తున్న ఆసీస్ జట్టును స్పిన్ బౌలర్ లేమి వేధిస్తోంది. షేన్ వార్న్ రిటైర్ మెంట్ తర్వాత ఆ జట్టుకు ప్రధాన స్పిన్ బౌలర్ లభించలేదనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ఆ జట్టు గ్లెన్ మ్యాక్స్ వెల్, స్మిత్ వంటి పార్ట్ టైమ్ స్పిన్నర్లతోనే బరిలోకి దిగక తప్పడం లేదు.