: సిడ్నీలో టాలీవుడ్ స్టార్ విక్టరీ వెంకటేశ్... చాముండితో కలిసి సెమీ ఫైనల్ వీక్షిస్తాడట!
టాలీవుడ్ స్టార్ విక్టరీ వెంకటేశ్ నిన్న ఆస్ట్రేలియా నగరం సిడ్నీ చేరుకున్నాడు. జూనియర్ క్రికెట్ సెలక్షన్ కమిటీ మాజీ చైర్మన్ చాముండేశ్వరీనాథ్ తో కలిసి వెంకటేశ్ సిడ్నీ చేరుకున్నాడు. క్రికెట్ వీరాభిమాని అయిన వెంకటేశ్ కు టీమిండియా ఆడే ప్రధాన మ్యాచ్ లన్నింటినీ ప్రత్యక్షంగా వీక్షించడం అలవాటు. ఈ క్రమంలో ప్రపంచంలో ఏ మూల మ్యాచ్ జరిగినా, వెంకటేశ్ అక్కడ వాలిపోతాడు. సగటు క్రికెట్ అభిమానిలా అతడు వీక్షకుల స్టాండ్స్ నుంచి కేరింతలు కొట్టడం తెలిసిందే. నేటి సెమీ ఫైనల్ మ్యాచ్ నూ పూర్తిగా ఆస్వాదించేందుకే వెంకీ సిడ్నీ చేరుకున్నాడట.