: సమష్టిగా రాణిస్తే ధోనీ సేనదే విజయం... ప్రపంచ పొట్టి మహిళ జ్యోతి వ్యాఖ్య
సమష్టిగా రాణిస్తే నేటి సెమీ ఫైనల్ లో టీమిండియాదే విజయమని ప్రపంచంలోనే పొట్టి మహిళగా రికార్డులకెక్కిన జ్యోతి అంటోంది. నాగపూర్ కు చెందిన ఆమె వరల్డ్ కప్ సెమీ ఫైనల్ నేపథ్యంలో మీడియాతో మాట్లాడింది. ఇప్పటికే వరుస విజయాలతో జైత్రయాత్ర కొనసాగిస్తున్న ధోనీ సేన, సెమీస్ లోనూ విజయం సాధించి ఫైనల్ చేరాలని ఆమె ఆకాంక్షిస్తోంది. 2011లో వరల్డ్ కప్ టైటిల్ ను గెలుచుకొచ్చిన కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ, ఈ సారి కూడా టైటిల్ ను నిలబెట్టుకోవాలని ఆమె పిలుపునిచ్చింది.