: వీఐపీలని ప్రత్యేకంగా చూడకండి...రాష్ట్రపతి, ప్రధాని, మంత్రి, సామాన్యుడు ఎవరైనా ఒకటే!: అధికారులకు కేజ్రీవాల్ ఆదేశం
వేసవిలో నీటి ఎద్దడి ఏర్పడితే, ఎవరికైనా సరే నీటి సరఫరాను నిలిపేయాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఢిల్లీలో జల్ బోర్డ్ తో సమీక్ష నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అవసరం కంటే ఎక్కువ నీటిని వినియోగిస్తున్న వారిపై ఓ కన్నేయాలని సూచించారు. రాష్ట్రపతి, ప్రధాని, మంత్రులు, సామన్యులు అంటూ తేడా చూపించవద్దని ఆయన స్పష్టం చేశారు. అవసరమైతే వీఐపీలకు కూడా నీటి సరఫరా నిలిపేసేందుకు వెనుకాడవద్దని అన్నారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ నిర్వహించడం చేతకాకపోతే అధికారాన్ని ఆమ్ ఆద్మీకి అప్పగించి తప్పుకోవాలని ఆయన బీజేపీకి సవాలు విసిరారు. అవినీతి విచ్చలవిడిగా జరగడం వల్లే కార్పొరేషన్ నిర్వహణ కష్టంగా మారిందని కేజ్రీవాల్ చెప్పారు.