: ఉభయగోదావరి ఎమ్మెల్సీ ఫలితంపై చంద్రబాబు అసంతృప్తి
ఉభయగోదావరి ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లాబీలో టీడీఎల్పీ సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఉభయగోదావరి జిల్లాల ఎమ్మెల్యేలు సరిగా పని చేయలేదని మండిపడ్డారు. దీంతో అభ్యర్థిపై స్థానికంగా వ్యతిరేకత ఉందని ఎమ్మెల్యేలు చంద్రబాబుకు తెలిపారు. పట్టిసీమ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఆయన ఎమ్మెల్యేలకు సూచించినట్టు సమాచారం.