: ఏప్రిల్ లో మూడు దేశాల్లో మోదీ విదేశీ పర్యటనలు
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ ఏడాదిలో రెండోసారి విదేశీపర్యటనలు ఖరారయ్యాయి. ఏప్రిల్ లో ఏకంగా మూడు దేశాల్లో ఆయన పర్యటించనున్నారు. ఏప్రిల్ 9 నుంచి 16 వరకు ఫ్రాన్స్, జర్మనీ, కెనడాల్లో పర్యటిస్తారని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ వెల్లడించారు. తొలుత మోదీ 9వ తేదీన ఫ్రాన్స్ వెళ్లనున్నారు. అక్కడ వివిధ విభాగాల వారిని, ప్రముఖ నేతలను కలసి చర్చిస్తారని వివరించారు. తరువాత 12న తిరిగి జర్మనీ చేరుకుని 14 వరకు అక్కడే ఉండనున్నారు. చివరిగా ఆరోజు సాయంత్రం బయలుదేరి జర్మనీ వెళ్లి 16వరకు ప్రధాని అక్కడుంటారు. ఈ సమయంలో కెనడా పీఎం స్టీఫెన్ హార్పర్ తో ప్రధాని చర్చలు జరపనున్నట్టు అధికారప్రతినిధి పేర్కొన్నారు.