: పట్టిసీమ ప్రాజెక్టుపై లోక్ సత్తా జేపీ విమర్శలు


ఏపీ ప్రభుత్వం చేపట్టబోతున్న పట్టిసీమ ప్రాజెక్టుపై లోక్ సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేశారు. అదొక పిచ్చి ప్రాజెక్టు అని విమర్శించారు. ఈ ప్రాజెక్ట్ రాజకీయపరంగా కాంట్రాక్టర్లకు మాత్రమే లబ్ది చేకూర్చే విధంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. విశాఖ మీడియాతో ఈ మేరకు జేపీ మాట్లాడారు. టీడీపీ అధికారంలోకి వచ్చి 9 నెలలైనా పోలవరం ప్రాజెక్టు కోసం ఒక్క రూపాయైనా ఖర్చు చేశారా? అని ప్రశ్నించారు. విభజన తరువాత పరిశ్రమలకు పన్ను రాయితీ ఇచ్చినప్పుడే అభివృద్ధి సాధ్యమన్న జేపీ అన్నారు. ప్రస్తుత ఏపీ అసెంబ్లీ సమావేశాలు వికృత క్రీడల్లా కనిపిస్తున్నాయని మండిపడ్డారు.

  • Loading...

More Telugu News