: మంత్రి జగదీష్ రెడ్డి వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం: సీఎం కేసీఆర్


తెలంగాణ శాసనసభలో కాంగ్రెస్ నేత చిన్నారెడ్డిపై మంత్రి జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆ సభలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఖండించారు. జగదీష్ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమన్నారు. అధికారపక్షం బాధ్యతతో వ్యవహరించాలని, అదే సమయంలో ప్రతిపక్షం కూడా సంయమనం పాటించాలని సీఎం సూచించారు. చిన్నారెడ్డికి సరైన విధంగానే మంత్రి పదవి దక్కిందన్నారు. సభలో ఏ ఒక్కరినీ చులకన చేసి మాట్లాడటం సరికాదని ఇరుపక్షాలకు హితవు చెప్పారు. ఒకవేళ ప్రతిపక్షాలు ఏదైనా ఆవేశంతో మాట్లాడినా, మంత్రులుగా దాన్ని సరైన పధ్ధతిలో తిప్పికొట్టాలని, అంతేగానీ ఆవేశాలకు వెళ్లకూడదని చెప్పారు. ఇద్దరి తరపున తాను విచారం వ్యక్తం చేస్తున్నానని పేర్కొన్నారు. మంత్రి సభలో కొంచెం కటువుగా మాట్లాడిన విషయం నిజమేనని, అలాంటి పదాలు సభలో మాట్లాడకూడదని కేసీఆర్ ఉద్ఘాటించారు. ఇక నుంచి దూషణలకు పోకుండా సభా సంప్రదాయాలను కాపాడుకుందామని కేసీఆర్ స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News