: రేణుకాచౌదరి అనుచరులను చెప్పుతో కొట్టిన రామ్ జీ భార్య


కాంగ్రెస్ ఎంపీ, ఫైర్ బ్రాండ్ రేణుకాచౌదరి అనుచరులనే చెప్పుతో కొట్టారు. ఖమ్మంలో ఆమె అనుచరులు మీడియా సమావేశం నిర్వహిస్తున్న సమయంలో డాక్టర్ రామ్ జీ నాయక్ భార్య కళావతి... రేణుక అనుచరులను చెప్పుతో కొట్టి, దుర్భాషలాడారు. గత ఎన్నికల్లో ఖమ్మం జిల్లా వైరా నుంచి కాంగ్రెస్ పార్టీ మహిళా అభ్యర్థిగా టికెట్ ఇప్పిస్తానని చెప్పి రూ. 1.10 కోట్లు డబ్బు తీసుకుని... ఆ తర్వాత మోసం చేశారని రామ్ జీ భార్య ఆరోపించారు. డబ్బును నేరుగా రేణుకా చౌదరికే ఇచ్చామని చెప్పారు. ఆ సమయంలో ఆమె పీఏలతో పాటు మరికొందరు కూడా ఉన్నారని తెలిపారు. రేణుకాచౌదరి మోసం చేసిందన్న బాధతోనే తన భర్త మరణించారని చెెప్పారు. ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ వేశామని... డబ్బు ఇచ్చామని నిరూపించే ఆధారాలన్నింటినీ కోర్టుకు సమర్పించామని కళావతి చెప్పారు. ఇంతవరకు కోర్టులో ఎలాంటి న్యాయం జరగలేదని... అవసరమైతే తాము సుప్రీంకోర్టుకు కూడా వెళతామని తెలిపారు.

  • Loading...

More Telugu News