: 8 నిమిషాల పాటు 150 మందికి నరకయాతన... హాహాకారాలు!
బార్సిలోనా నుంచి డస్సెల్ డార్ఫ్ కు వెళుతూ ఫ్రాన్స్ లోని ఆల్ఫ్స్ పర్వతాల్లో కూలిపోయిన ఎయిర్ బస్ విమాన దుర్ఘటనలో ఒళ్ళు గగుర్పొడిచే నిజాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. 33000 అడుగులపైన ప్రయాణిస్తూ వెళ్ళాల్సిన విమానం సాంకేతిక లోపంతో 6,000 అడుగుల దిగువకు వచ్చిందని, ఇందుకు సుమారు 8 నిమిషాల సమయం పట్టిందని జర్మనీ ప్రకటించింది. విమానం వేగంగా కిందకు వస్తున్న సంగతి ప్రయాణికులకు తెలిసే ఉండవచ్చని, విమానం అత్యవసర ల్యాండింగ్ అవుతుందని పైలెట్ చెప్పాడని ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. చుట్టూ ఆల్ఫ్స్ పర్వతాలు మినహా మరేమీ కనిపించక తమ ప్రాణాలు మరికాసేపట్లో పోతాయేమోనని ప్రయాణికులు తీవ్ర భయందోళనల మధ్య, హాహాకారాలు చేస్తూ, ఆ 8 నిమిషాలు నరకయాతన అనుభవించి ఉండవచ్చని వివరించారు. బ్లాక్ బాక్స్ దొరికిందని, అందులోని సమాచారం విశ్లేషిస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయని పేర్కొన్నారు.