: నామినేషన్ల సమయంలో పరిస్థితి వేరు... ప్రస్తుత పరిస్థితి వేరు: నటుడు ఉత్తేజ్
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో రాజేంద్రప్రసాద్ ప్యానల్ తరఫున పోటీ చేస్తున్న ఉత్తేజ్ హఠాత్తుగా బరిలోంచి తప్పుకున్నారు. సంయుక్త కార్యదర్శిగా ఆయన నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే. తాను పోటీ నుంచి తప్పుకున్న తర్వాత ఉత్తేజ్ ఓ వార్తా చానల్ తో మాట్లాడారు. పోటీ నుంచి తప్పుకోవడం వెనుక ఎలాంటి ఒత్తిడులు లేవని, కేవలం వ్యక్తిగత కారణాల వల్లే తప్పుకున్నానని స్పష్టం చేశారు. అయితే, నామినేషన్ వేసే సమయంలో ఉన్న పరిస్థితి వేరు... ప్రస్తుతం ఉన్న పరిస్థితి వేరని చెప్పారు. దీనికి సంబంధించి క్లారిటీ ఇవ్వాలని కోరితే... ఆయన సమాధానాన్ని దాటవేశారు. పోటీ నుంచి తప్పుకున్న విషయాన్ని రాజేంద్రప్రసాద్ కు కూడా తెలియజేశానని చెప్పారు.