: పాకిస్థాన్ జెండా ఎగురవేసినందుకు కాశ్మీర్ మహిళా నేత అసియా అంద్రాబీపై కేసు


జమ్మూ కాశ్మీర్ లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ 'దుఖత్రాన్-ఏ-మిలాత్' పార్టీ అధినేత్రి అసియా అంద్రాబీపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) కింద కేసు నమోదైంది. పాకిస్థాన్ జాతీయ దినోత్సవం నాడు ఆమె ఆ దేశపు జెండాను ఎగురవేశారు. ఈ మేరకు ఫిర్యాదులు రావడంతో యూఏపీఏ చట్టం సెక్షన్ 13 కింద కేసు పెట్టినట్టు పోలీసులు తెలిపారు. వేర్పాటువాద నేతగా పేరున్న ఆమె ఉదంతంపై విచారణ మొదలు పెట్టినట్టు వివరించారు. ఆమెను ఎప్పుడు అదుపులోకి తీసుకుంటారని ప్రశ్నించగా, నిబంధనల ప్రకారం చర్యలు చేపడతామని పేర్కొన్నారు. ఈనెల 23న ఆమె పాక్ జెండాను ఆవిష్కరించి, ఆపై ఆ దేశపు జాతీయ గీతాన్ని ఆలపించారని వార్తలు రావడంతో వివాదం మొదలైన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News