: ఆంధ్ర విశ్వవిద్యాలయ డిగ్రీ ప్రశ్నాపత్రాలు లీక్... వీసీ ఆగ్రహం
విశాఖలోని ఆంధ్రా విశ్వవిద్యాలయ డిగ్రీ ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయి. హైటెక్ పధ్ధతిలో చేతితో రాసిన ప్రశ్నలను ఫోటోల రూపంలో అభ్యర్థుల సెల్ ఫోన్ లకు ఓ ముఠా పంపినట్లు సమాచారం. ముందుగా షిప్ యార్డు కళాశాల డిగ్రీ విద్యార్థులకు ప్రశ్నాపత్రాలు అందాయని తెలుస్తోంది. ఒక్కో పేపరును ఐదువేల రూపాయలకు ముఠా విక్రయించినట్టు తెలిసింది. విషయం తెలిసిన విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్ష రద్దుచేసి, వెంటనే విచారణకు ఆదేశించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.