: జగదీశ్వర్ రెడ్డి! నోరు అదుపులో పెట్టుకో!: మంత్రికి కాంగ్రెస్ ఎమ్మెల్యే హెచ్చరిక


టీ.కాంగ్రెస్ నేతలనుద్దేశించి తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి శాసనసభలో చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ మండిపడ్డారు. సభలో ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ఊరుకోమని, నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. సభలో జరుగుతున్న తంతును ప్రజలు గమనిస్తున్నారని, అడ్డగోలుగా మాట్లాడితే బుద్ది చెబుతారన్నారు. సంస్కార హీనుల చేతుల్లో తెలంగాణను పెట్టబోమన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ విడుదలలో మీకెన్ని ముడుపులు అందాయో అందరికీ తెలుసునన్న సంపత్, బయట మిమ్మల్ని అంతా 'ఫైవ్ పర్సంట్ మినిస్టర్' అని అంటున్నారని చెప్పారు. మీలా మాకు సోడా మిక్సింగ్, బ్రోకరింగ్ రాదన్నారు.

  • Loading...

More Telugu News