: ప్రతిపక్షాన్ని వైసీపీగా గుర్తించండి... అధికార పక్షానికి బీజేపీ ఎమ్మెల్యే చురకలు!


ఏపీ అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తమ మిత్రపక్షమైన టీడీపీకి చురకలంటించారు. సభలో అసలు ప్రాతినిధ్యమే లేని కాంగ్రెస్ పార్టీ పేరు పదే పదే వినిపిస్తుండటంతో పాటు అధికార టీడీపీ, విపక్ష వైసీపీలు కాంగ్రెస్ పార్టీ పేరును ప్రస్తావించడంపై ఆయన విస్మయం వ్యక్తం చేశారు. అసలు సభలో ప్రతిపక్ష స్థానంలో ఉన్న పార్టీ ఏదని కూడా ఆయన ప్రశ్నించారు. ‘‘ప్రతిపక్ష సభ్యులను చూపిస్తూ సీఎం చంద్రబాబు కాంగ్రెస్ పేరు ప్రస్తావిస్తున్నారు. అధికార పక్షాన్ని చూపిస్తూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పేరును ప్రస్తావిస్తున్నారు. దీంతో కొత్తగా సభకు వచ్చిన మా లాంటి సభ్యులంతా అయోమయానికి గురవుతున్నారు. ప్రతిపక్ష స్థానంలో ఉన్న పార్టీని వైసీపీగా గుర్తించాలని స్పీకర్ సభ్యులందరికీ సూచించాలి’’ అంటూ రాజు టీడీపీకి సుతిమెత్తగా చురకలంటించారు. దీనికి స్పందించిన స్పీకర్ ‘‘తల్లి, పిల్ల కాంగ్రెస్ అని అధికార పక్షం చెబుతోంది. వారే క్లారిటీ ఇవ్వాలి’’ అని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News