: జాతీయ చలనచిత్ర పురస్కార విజేతలకు మమతా బెనర్జీ అభినందనలు
62వ జాతీయ చిత్ర పురస్కార విజేతలకు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శుభాకాంక్షలు తెలిపారు. "62వ జాతీయ సినీ పురస్కారాలు దక్కించుకున్నవారికి నా అభినందనలు. బెంగాల్ లోనూ, దేశంలోని ఇతర ప్రాంతాలలోను ప్రతిభావంతమైన పలువురు కళాకారులున్నారు. అందరికీ నా శుభాకాంక్షలు" అని బెనర్జీ ట్వీట్ చేశారు. జాతీయ పురస్కారాల్లో బెంగాల్ దర్శకుడు శ్రిజిత్ ముఖర్జీకి ఉత్తమ దర్శకుడి (చోటుషోక్నే చిత్రానికి) పురస్కారం ప్రకటించారు.