: మూడేళ్లు కూడా నిండని డాలీ... విలువిద్యలో జాతీయ రికార్డు


ఆ చిన్నారి పేరు డాలీ శివాని చెరుకూరి. జాతీయ స్థాయిలో విలువిద్యకారుడిగా పేరు తెచ్చుకొని ప్రస్తుతం అర్చరీ అకాడమీ నడుపుతున్న సత్యనారాయణ కుమార్తె ఈమె. 2004లో కుమార్తెను, 2010లో కుమారుడిని కోల్పోయిన సత్యనారాయణ దంపతులు అద్దె గర్భం విధానంలో 2012లో డాలీకి తల్లిదండ్రులయ్యారు. ఈ చిన్నారి మరెవరికీ సాధ్యం కాని రీతిలో 5, 7 మీటర్ల దూరంలోని లక్ష్యాలను సునాయాసంగా ఛేదించి 200 పాయింట్లు సాధించింది. మూడవ పుట్టిన రోజును మరో 8 రోజుల్లో జరుపుకోనున్న డాలీ, విలువిద్యలో చూపుతున్న ప్రతిభ అసామాన్యమని ఆమె రికార్డును గుర్తించిన లిమ్కా బుక్ ప్రతినిధి విశ్వరూప్ రాయ్ చౌదరి కొనియాడారు. పాప కోసం ప్రత్యేకంగా బాణాలను తయారు చేయించినట్టు సత్యనారాయణ వివరించారు.

  • Loading...

More Telugu News