: టాటాల ఆలోచనకు ఆర్‌బీఐ మోకాలడ్డు!


టాటా టెలీ సర్వీసెస్‌ లో జపాన్‌ కు చెందిన టెలికాం సంస్థ ఎన్‌టిటి డొకొమో అనుభవిస్తున్న 26.5 శాతం వాటాను కొనుగోలు చేయాలన్న టాటా సన్స్ ప్రతిపాదనను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తిరస్కరించింది. డొకొమో వాటాను రూ. 7,250 కోట్లకు టాటా సన్స్ కొనుగోలు చేయాలని భావిస్తూ, అందుకు అనుమతులు కోరుతూ, సంబంధిత ప్రతిపాదనలను ఆర్‌బీఐకి పంపింది. కాగా, ఫెమా నిబంధనలకు అనుగుణంగా టాటా ప్రతిపాదనలు లేవని ఆరోపిస్తూ, వీటిని ఆమోదించలేమని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. షేరు ఒక్కింటికి రూ. 58.045 చొప్పున (2009లో డొకొమో చెల్లించిన దానిలో సగం) ఇవ్వాలని టాటా సన్స్ భావిస్తుండగా, కొనాలనుకుంటే ప్రస్తుత విలువ ప్రకారం షేర్లను కొనుగోలు చేయవచ్చని ఆర్‌బీఐ సూచించిందని టాటా సన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. టెలికాం రంగంలో ప్రతికూల పరిస్థితులు నెలకొని ఉండడంతో ఈ జాయింట్ వెంచర్‌ కు స్వస్తి చెప్పాలని ఎన్‌టిటి డొకొమో భావిస్తోంది.

  • Loading...

More Telugu News