: భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్ కి వరుణ గండం... సిడ్నీలో తగ్గని వర్షం
ఇండియా, ఆస్ట్రేలియా మధ్య రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ కి వేదిక కానున్న సిడ్నీలో నిన్నటి నుంచి వర్షం పడుతుండటంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ఈ పోరు తీవ్రంగా ఉంటుందని, తమ సర్వశక్తులూ ఒడ్డేందుకు ఇరు జట్ల ఆటగాళ్లు రెడీ అవుతున్నారని, పరుగుల వరద ఖాయమని అభిమానులు భావిస్తున్న తరుణంలో, వరుణుడు అడ్డు తగలవచ్చని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నేడు కూడా వర్షం పడుతుందని, రేపు ఉదయానికి కొంత పొడి వాతావరణం కనిపిస్తుందని తెలిపింది. కాగా, ఈ వర్షం పిచ్ పై చూపే ప్రభావం ఏ జట్టుకు అనుకూలంగా మారుతుందో వేచి చూడాలి.