: సిడ్నీ చేరుకున్న అనుష్క శర్మ


వరల్డ్ కప్ లో భాగంగా రేపు సిడ్నీ వేదికగా జరగనున్న రెండో సెమీస్ లో టీమిండియా, ఆస్ట్రేలియాతో తలపడనుంది. మ్యాచ్ కోసం ఇరు జట్లు సర్వసన్నద్ధమయ్యాయి. టీమిండియాకు విజయాన్ని సాధించేందుకు కోహ్లీ తన బ్యాటింగ్ నైపుణ్యానికి తుది మెరుగులు దిద్దుకున్నాడు. ఇదిలా ఉంటే, జీవిత భాగస్వాములు, ప్రియురాళ్లతో కలిసే విషయంపై ఉన్న నిషేధాన్ని, టీమిండియా నాకౌట్ కు అర్హత సాధించడంతో బీసీసీఐ ఎత్తివేసింది. దీంతో పెళ్లైన క్రికెటర్లు భార్యలతో, పెళ్లి కాని ప్రసాదులు ప్రియురాళ్లతో కలిసే అవకాశం చిక్కింది. ఇప్పటికే కొందరి జీవిత భాగస్వాములు ఆస్ట్రేలియా చేరారు. తాజాగా నిన్న కోహ్లీ ప్రేయసి అనుష్క కూడా సిడ్నీ చేరుకుంది. ఆమెతో కలిసి కోహ్లీ నిన్న ఓ రెస్టారెంటుకు వెళ్లి డిన్నర్ కూడా చేశాడు. రేపు మైదానంలో కోహ్లీ ఆడనున్న సెమీస్ ను స్టాండ్స్ నుంచి అనుష్క వీక్షించనుంది.

  • Loading...

More Telugu News