: సర్కారీ చెక్ పోస్టుల్లో ప్రైవేట్ వ్యక్తుల వసూళ్లు... ఏపీలో ఆర్టీఓ చెక్ పోస్టులపై ఏసీబీ తనిఖీలు!


ఏపీలోని రవాణా శాఖకు చెందిన అన్ని ప్రధాన చెక్ పోస్టులపై అర్ధరాత్రి దాటిన తర్వాత అవినీతి నిరోధక శాఖ ఏకకాలంలో దాడులు చేసింది. ప్రస్తుతం ఏసీబీ అధికారులు ఆయా ప్రాంతాల్లోని చెక్ పోస్టుల్లో రికార్డులను పరిశీలిస్తున్నారు. చిత్తూరు జిల్లా రేణిగుంట, అనంతపురం జిల్లా పెనుకొండ, ఆంధ్ర-ఒడిశా సరిహద్దులోని ఇచ్ఛాపురం, నెల్లూరు జిల్లా బీవీపాలెం తదితర ప్రాంతాల్లోని చెక్ పోస్టుల్లో కొనసాగుతున్న ఈ దాడుల్లో పలు ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. ప్రభుత్వానికి చెందిన చెక్ పోస్టుల్లో ప్రైవేట్ వ్యక్తులు తిష్ఠ వేసి వసూళ్లకు పాల్పడుతున్న వైనాన్ని ఏసీబీ అధికారులు గుర్తించారు. చెక్ పోస్టుల్లోని ప్రైవేట్ వ్యక్తులను ఏసీబీ అదుపులోకి తీసుకుంది. సదరు ప్రైవేట్ వ్యక్తుల వసూళ్లకు అవకాశం కల్పించిన అధికారులపై కేసులు నమోదు చేసింది. ఇక వాహనదారుల నుంచి అక్రమ పద్ధతుల్లో వసూలు చేసిన లక్షలాది రూపాయలను కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

  • Loading...

More Telugu News