: పీతల సుజాత, జూపూడి అట్రాసిటీ చట్టాన్ని అవహేళన చేస్తున్నారు: విద్యార్థులు
మంత్రి పీతల సుజాత, జూపూడి ప్రభాకర్ రావులు ఎస్సీ, ఎస్టీల రక్షణ కోసం ఉద్దేశించిన అట్రాసిటీ చట్టాన్ని అవహేళన చేస్తున్నారని ఆంధ్రాయూనివర్సిటీ విద్యార్థి విభాగం మండిపడింది. టీడీపీ నేతల తీరుపై ఆందోళన నిర్వహించిన ఏయూ విద్యార్థి, పరిశోధకులు మాట్లాడుతూ, అసెంబ్లీలో అన్యాయం జరిగిందని, అవహేళన చేశారని రెండు రోజుల తరువాత టీడీపీ నేతలకు తెలిసిందా? అని ప్రశ్నించారు. కులం పేరిట అవహేళన చేసినప్పుడు ఎందుకు ప్రశ్నించలేదని వారు నిలదీశారు. పార్టీ మారిన జూపూడి వైఎస్సార్సీపీపై విమర్శలు చేయడం కంటే, పార్టీ మారకముందే కులం పేరిట అవమానం జరుగుతోందని జగన్ పై కేసు పెట్టాల్సిందని వారు సూచించారు. కులం పేరిట జరిగే అవమానాల నుంచి రక్షణ కల్పించేందుకు ఉద్దేశించిన చట్టాన్ని అవహేళన చేయవద్దని వారు హితవు పలికారు.