: మిస్డ్ కాల్ ఇవ్వండి...ప్రధాని ట్వీట్లు పొందండి!


సామాజిక మాధ్యమాన్ని సమర్థవంతంగా వినియోగించుకునే రాజకీయ వేత్తగా పేరుప్రఖ్యాతులు సంపాదించిన ప్రధాని నరేంద్ర మోదీ, మరింతమందికి చేరువయ్యే ప్రణాళికలు రచిస్తున్నారు. భూసేకరణ ఉద్యమం పేరిట ప్రతిపక్షాలన్నీ ఏకమవుతున్న ప్రస్తుత తరుణంలో తన వాణి వినిపించేందుకు ఆయన సమర్థవంతమైన మార్గం ఎంచుకున్నారు. ఆయన ట్విట్టర్ ఖాతాను ఫాలో అవ్వాలంటే ట్విట్టర్ ఖాతా ఓపెన్ చేయాల్సిన అవసరం లేకుండా, ఫోన్ లోనే ఆయన ట్వీట్లు ప్రత్యక్షమయ్యే వెసులుబాటు కల్పించారు. ఇందుకు చేయాల్సిందల్లా 01130063006 అనే నెంబర్ కు ఓ మిస్డ్ కాల్ ఇస్తే, ఆ తరువాత ప్రధాని చేసే ట్వీట్లన్నీ ఫోన్ లో ప్రత్యక్షం కానున్నాయి. ఇది ప్రజలతో మమేకమయ్యే ప్రయత్నమంటూ ఆయన ట్వీట్ లో తెలిపారు.

  • Loading...

More Telugu News