: మృతుల్లో ఎక్కువ మంది జర్మనీ, స్పానిష్, టర్కీ జాతీయులు: హోలాండే


దక్షిణ ప్రాన్స్ లో జరిగిన విమాన ప్రమాదంలో మృతుల్లో ఎక్కువ మంది జర్మనీ, స్పానిష్, టర్కీ జాతీయులని ఫ్రాన్స్ అధ్యక్షుడు హొలాండే తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విమానప్రమాదం జరిగిన ప్రాంతం మారుమూల ఉండడంతో సహాయ బృందాలు చేరుకోవడం ఆలస్యమైందని అన్నారు. జర్మన్ వింగ్స్ కు చెందిన విమాన ప్రమాదం విషాదమని ఆయన పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ ప్రమాద ఘటనపై జర్మనీ చాన్సెలర్ ఏంజెలా మోర్కెల్ తో చర్చించినట్టు ఆయన వెల్లడించారు. జర్మనీకి చెందిన ప్రముఖ విమానయాన సంస్థ లుఫ్తాన్సాకు చెందిన బడ్జెట్ విమాన విభాగమే జర్మన్ ఎయిర్ లైన్స్, దీనికి యూరప్ లో విశేషమైన ప్రజాదరణ ఉంది. జర్మన్ నగరాల నుంచి మధ్యధరా సముద్ర పర్యాటక ప్రాంతాలకు ఈ సంస్థ ఎక్కువ విమాన సర్వీసులు నడుపుతుంది.

  • Loading...

More Telugu News