: టీమిండియా పేస్ బౌలింగును సమర్థవంతంగా ఎదుర్కోగలం: ఆరోన్ ఫించ్
టీమిండియా పేస్ బౌలింగును సమర్థవంతంగా ఎదుర్కోగలమని ఆస్ట్రేలియా ఓపెనర్ ఆరోన్ ఫించ్ పేర్కొన్నాడు. గురువారం జరగనున్న సెమీఫైనల్ మ్యాచ్ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీమిండియా పేస్ త్రయాన్ని అడ్డుకునేందుకు తమ వద్ద ప్రణాళికలు ఉన్నాయని అన్నాడు. ఉమేష్ యాదవ్, మహ్మద్ షమీ, మోహిత్ శర్మ 42 వికెట్లు పడగొట్టిన సంగతి తమకు గుర్తుందని ఫించ్ తెలిపాడు. ఏడు మ్యాచుల్లో 70 వికెట్లు తీయడం సామాన్య విషయం కాదని పేర్కొన్న ఫించ్, ప్రణాళికాబద్దంగా ఆడి టీమిండియాపై విజయం సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేశాడు.