: మెక్ కల్లమ్ పిలుపుకి అక్లాండ్ వాసుల అశేష స్పందన


న్యూజిలాండ్ జట్టు విజయంలో ఆటగాళ్లు ప్రధాన పాత్ర పోషించినప్పటికీ, జట్టులో స్పూర్తి రగిలించింది మాత్రం ఆక్లాండ్ వాసులే. ఆక్లాండ్ లోని ఈడెన్ పార్క్ ను బ్లాక్ కేప్స్ తో నింపాలని, ఆక్లాండ్ వాసులు ఆఫీసులకు రాకుంటే యజమానులు వారిని నిందించవద్దని, స్టేడియంలో ఓ కుర్చీ, జాతీయ పతాకం ప్రతి ఒక్కరి పేరున ఎదురుచూస్తుందని అంటూ న్యూజిలాండ్ క్రికెట్ జట్టు కెప్టెన్ బ్రెండన్ మెక్ కల్లమ్ బహిరంగ లేఖ రాసిన సంగతి తెలిసిందే. సాక్షాత్తు జట్టు కెప్టెన్ స్వయంగా ఆహ్వానించడంతో పులకించిన అభిమాన జనసందోహం, జట్టును ప్రోత్సహించేందుకు పెద్దఎత్తున స్టేడియంకు చేరుకుంది. న్యూజిలాండ్ విజయానికి చివరి ఓవర్ లో 12 పరుగులు కావాలి. ఈ దశలో బౌలింగ్ కు స్టెయిన్ దిగాడు. బ్యాటింగ్ లో వెటోరీ ఉన్నాడు. దీంతో కివీస్ విజయం సాధిస్తుందా? అనే అనుమానం అందర్లోనూ రేగింది. ఈ దశలో స్టేడియం మొత్తం న్యూజిలాండ్ ఆటగాళ్లకు మద్దతు పలికింది. అభిమానులు క్రికెటర్లను ప్రోత్సహిస్తూ బ్యాట్స్ మన్ లో స్పూర్తి రగిలించారు. దీంతో ఈ ఓవర్ లో ఎలాంటి ఒత్తిడి లేకుండా ఓ ఫోర్, సిక్స్ తో న్యూజిలాండ్ విజయం సాధించింది. దీంతో అప్రతిహతంగా కివీస్ ఫైనల్ లో అడుగుపెట్టింది.

  • Loading...

More Telugu News