: ఇండియన్ నేవీ అమ్ములపొదిలోకి కొత్త యుద్ధనౌక


భారత నౌకాదళం అమ్ముల పొదిలోకి మరో యుద్ధ నౌక చేరింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో కోల్ కతాలోని జీఆర్ఎస్ఇ యూనిట్ లో తయారు చేసిన యుద్ధనౌకను జలప్రవేశం చేయించి, భారత నావికాదళానికి అప్పగించారు. ఎంకే 4 ప్రాజెక్టులో భాగంగా తయారు చేసిన నాలుగో ల్యాండింగ్ క్రాఫ్ట్ యుటిలిటీ ఎల్పీజీ నౌక ఇది. ఎల్-54గా వ్యవహరిస్తున్న ఈ నౌకను ఇండియన్ నేవీ డిప్యూటీ చీఫ్ వైస్ అడ్మిరల్ ఆర్కే పట్నాయక్ భార్య షిల్లీ పట్నాయక్ చేతుల మీదుగా జలప్రవేశం చేయించారు. ఎనిమిది యుద్ధనౌకల ప్రాజెక్టుల్లో ఇది నాలుగవది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో భారత్ అత్యాధునిక యుద్ధ సామర్థ్యం గల నౌకలు నిర్మిస్తుండడంతో, యుద్ధనౌకలు నిర్మించగల సామర్థ్యం గల దేశాల సరసన భారత్ నిలిచింది.

  • Loading...

More Telugu News