: సెమీస్ లో ఓడిపోవడం ఎవరికైనా బాధాకరంగా ఉంటుంది: సచిన్
న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాల మధ్య ఈ రోజు జరిగిన ఉత్కంఠభరిత సెమీ ఫైనల్ మ్యాచ్ పై క్రికెట్ లెజెండ్ సచిన్ స్పందించాడు. ఏ జట్టైనా సెమీ ఫైనల్ వరకు చేరి, అక్కడ ఓటమిపాలయితే... ఎవరికైనా బాధను కలిగిస్తుందని అన్నాడు. సెమీస్ లో ఓడిపోయినప్పటికీ టోర్నీ మొత్తం దక్షిణాఫ్రికా అద్భుతమైన ఆటతీరును కనబరిచిందని కొనియాడాడు. ఇదే సమయంలో న్యూజిలాండ్ కు శుభాకాంక్షలు తెలిపాడు. అద్భుత క్రికెట్ ఆడి, ప్రపంచకప్ ఫైనల్ కు చేరుకున్నందుకు అభినందనలు తెలియజేశాడు.