: కేన్సర్ భయంతో అండాశయం తొలగించుకున్న ఏంజెలీనా జోలీ
కేన్సర్ భయం కారణంగా కొన్ని రోజుల కిందట తన అండాశయాన్ని, ఫెలోపియన్ నాళాలను తీసివేంచుకున్నట్టు హాలీవుడ్ నటి ఏంజెలీనా జోలీ ప్రకటించింది. ప్రస్తుతం తాను మెనోపాజ్ దశలోకి ప్రవేశించానని తెలిపింది. "ఇక నాకు పిల్లలను కనే సామర్థ్యం లేదు. నాలో కొన్ని శారీరక మార్పులు వస్తాయనుకుంటున్నా. కానీ ఇక ఏమైనా నేను ప్రశాంతంగా ఉంటాను. నేను చాలా దృఢమైన మనస్తత్వం వున్న వ్యక్తిని అని చెప్పలేను. అందుకే, ఇలా చేశాను. ఇక భయపడాల్సిన అవసరం మాత్రం లేదు" అని న్యూయార్క్ టైమ్స్ పత్రికతో జోలీ తన అనుభవాన్ని పంచుకుంది. రెండేళ్ల కిందటే ఆరంభ దశలో ఉన్న బ్రెస్ట్ కేన్సర్ కు శస్త్ర చికిత్స చేయించుకున్న జోలీ, తాజాగా ఈ విషయం ప్రకటించడంతో అభిమానులు నిర్ఘాంతపోతున్నారు. అయితే తన తల్లి, అమ్మమ్మ, ఆంటీ ముగ్గురూ ఈ ప్రాణాంతక వ్యాధి కారణంగానే చనిపోవడంతో ముందు జాగ్రత్త కోసం జోలీ ఇలా చేసినట్టు తెలుస్తోంది.