: గ్రౌండ్ లోనే కంటతడి పెట్టిన మోర్కెల్
ప్రపంచకప్ సెమీఫైనల్లో ఉత్కంఠ భరిత పోరులో దక్షాణాఫ్రికాను కంగుతినిపించి న్యూజిలాండ్ ఫైనల్లో అడుగుపెట్టింది. 43 ఓవర్లలో 298 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ బ్యాట్స్ మెన్ సమష్టిగా రాణించి జయకేతనం ఎగురవేశారు. ఆట మొత్తం నువ్వా? నేనా? అన్న రీతిలో సాగింది. కొన్ని సందర్భాల్లో దక్షిణాఫ్రికా ఫైనల్స్ చేరుతుందని కూడా అనిపించింది. అయితే చివరి ఓవర్లో మరో బంతి మిగిలి ఉండగానే ఇలియట్ సిక్స్ కొట్టడంతో కివీస్ ఫైనల్స్ చేరింది. దీంతో, కివీస్ ఆటగాళ్ల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. స్టేడియంలోని కివీస్ అభిమానులు కేరింతలు కొట్టారు. అయితే, మూడు కివీస్ వికెట్లు పడగొట్టి టెన్షన్ క్రియేట్ చేసిన సఫారీ బౌలర్ మోర్కెల్ మాత్రం ఓటమిని జీర్ణించుకోలేకపోయాడు. ఉద్వేగాన్ని, భాధను ఆపుకోలేకే గ్రౌండ్ లోనే కంటతడి పెట్టాడు. మోర్కెల్ తో పాటు ఆటగాళ్లంతా తీవ్ర వేదనకు గురయ్యారు.