: రాజధానికి అమరావతి పేరు పెట్టడాన్ని స్వాగతిస్తున్నాం: మాజీ మంత్రి డొక్కా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి అమరావతి పేరు పెట్టడాన్ని స్వాగతిస్తున్నామని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ అన్నారు. రాష్ట్ర చిహ్నంగా జ్ఞానబుద్దను గుర్తించాలని, ఏపీ నూతన అసెంబ్లీకి అంబేద్కర్ పేరు పెట్టాలని ఆయన కోరారు. అంతేగాక, ఏపీ రాజధాని ముఖ్య నిర్మాణ ప్రాంతానికి ఎన్టీఆర్ పేరు పెట్టాలని, కరకట్ట వెంట ట్యాంక్ బండ్ లాగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఏప్రిల్ 14న తన రాజకీయ భవిష్యత్ గురించి ప్రకటిస్తానని చెప్పారు. రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీ నుంచి తప్పుకున్న డొక్కా ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.