: తొలి వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్... స్కోరు 71/1


సౌతాఫ్రికాతో జరుగుతున్న ప్రపంచకప్ సెమీఫైనల్లో 298 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో న్యూజిలాండ్ కు ఎదురుదెబ్బ తగిలింది. అద్భుత బ్యాటింగ్ తో స్కోర్ బోర్డును ఉరకలెత్తించిన బ్రెండన్ మెక్ కల్లం 59 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మోర్కెల్ బౌలింగ్ లో స్టెయిన్ క్యాచ్ పట్టడంతో పెవిలియన్ చేరాడు. దీంతో, 71 పరుగుల వద్ద న్యూజిలాండ్ తొలి వికెట్ కోల్పోయింది. 227 స్ట్రయిక్ రేటుతో బౌలర్లను బెంబేలెత్తిస్తున్న మెక్ కల్లం ఔట్ అవడంతో సౌతాఫ్రికా ఊపిరి పీల్చుకుంది. అనంతరం గప్టిల్ (6) కు విలియంసన్ జతకలిశాడు.

  • Loading...

More Telugu News