: మెక్ కల్లం దెబ్బకు బెంబేలెత్తుతున్న సౌతాఫ్రికా
ఆక్లాండ్ లో జరుగుతున్న సెమీఫైనల్లో 43 ఓవర్లలో 298 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ స్కోర్ బోర్డును ఉరకలెత్తిస్తోంది. బ్రెండన్ మెక్ కల్లం దెబ్బకు దక్షిణాఫ్రికా బౌలర్లు చేష్టలుడిగిపోయారు. కేవలం 22 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. ప్రస్తుతం 25 బంతుల్లో 59 పరుగులతో ఆడుతున్నాడు. మరోవైపు, క్వార్టర్ ఫైనల్ డబుల్ సెంచరీ హీరో గప్టిల్ 6 పరుగులు (5 బంతులు) చేసి క్రీజులో ఉన్నాడు. ప్రస్తుతం న్యూజిలాండ్ స్కోరు 5 ఓవర్లకు 71 పరుగులు.