: వర్షం ఆగింది... సెమీస్ మ్యాచ్ 43 ఓవర్లకు కుదింపు


దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్ల మధ్య సెమీఫైనల్ మ్యాచ్ ను 43 ఓవర్లకు కుదించారు. సఫారీలు తొలుత బ్యాటింగ్ చేస్తుండగా, 38 ఓవర్ల అనంతరం వర్షం రావడంతో మ్యాచ్ నిలిపివేశారు. అప్పటికి దక్షిణాఫ్రికా 3 వికెట్లకు 216 పరుగులు చేసింది. డు ప్లెసిస్ 82, కెప్టెన్ ఏబీ డివిలియర్స్ 60 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆక్లాండ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఆరంభంలో కివీస్ బౌలర్ల ధాటికి తడబడింది. అయితే, డివిలియర్స్, డు ప్లెసిస్ ధాటిగా ఆడడంతో పుంజుకుంది.

  • Loading...

More Telugu News